గజానన్ సొసైటీ కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గజానన్ సొసైటీ కాలనీలో రూ.80.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డును PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన , అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గజానన్ కాలనీ లో 80 లక్షల రూపాయలతో నిర్మించిన‌ సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఈ సీసీ రోడ్డు ద్వారా గజానన్ కాలనీ ప్రజలకు సాంత్వన చేకూరింది అని , పెద్ద ఉపశమనం లభించింది అని, కాలనీ వాసులకు ఎంత‌గానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, కిరణ్, ఇంద్రారెడ్డి, లక్ష్మణ్, మహాదేవ్, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here