చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌తో మియాపూర్‌కు మ‌హ‌ర్ద‌శ‌: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న నాయనమ్మ కుంట చెరువు సుందరీరణలో భాగంగా HDFC బ్యాంక్ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టిన చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా చెరువును మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగ వాడ్, HDFC బ్యాంక్ ప్రతినిధులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మియపూర్ లో అన్ని చెరువులకు సుందరీకరణ భాగ్యం కలిగింద‌ని, త్వరలోనే మియపూర్ రూపురేఖలు మారుతాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా CI బాల గోపాల్, HDFC బ్యాంక్ ప్రతినిధులు సౌరవ్ చటర్జీ, రవి వర్మ, CSR ఐటీ సంస్థ ప్రతినిధులు చైతన్య, రాము, నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here