శేరిలింగంపల్లి, మార్చి 1 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హుడా కాలనీ, గంగారంలో స్థానిక సమస్యలు డ్రైనేజీ , రోడ్డు , పారిశుధ్యం వంటి పెండింగ్ పనుల పరిష్కారం కోసం, గంగారాం బస్తీ దవాఖాన లోని వసతుల పర్యవేక్షణలో భాగంగా బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. హుడా కాలనీ , గంగారంలో స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజిత్ సేనాపతి , బీజేపీ సీనియర్ నాయకులు దేవాల్ యాదవ్ , మోహన్ ముదిరాజ్ , బీజేపీ డివిజన్ కార్యదర్శి రాజు యాదవ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు పవన్ కుమార్ , రామకృష్ణ , మునిస్వామి , కిరణ్ , అది పాల్గొన్నారు.






