శేరిలింగంప‌ల్లిలోని స‌మస్య‌ల‌పై బీఆర్ఎస్ నాయ‌కులు ఉద్య‌మం

శేరిలింగంప‌ల్లి, మార్చి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం లోని మియాపూర్ నడిగడ్డ తండా లో సేవాలాల్ మహారాజ్ గుడి దగ్గర నుండి బి ఆర్ ఎస్ పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రజాసమస్యలపై పాదయాత్ర నిర్వ‌హించారు. ఈ పాదయాత్రలో భాగంగా నడిగడ్డ తండాలో అనేక సమస్యలపై అక్కడ కాలనీవాసులను అడిగి తెలుసుకుని వారి సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి శేరిలింగంపల్లి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి భూ కబ్జాదారుల కొమ్ము కాస్తూ కాలనీల‌ సమస్యలు పట్టించుకోకుండా బినామీలకు అండగా ఉంటూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తూ కబ్జా చేసిన భూములను, బినామీలను కాపాడుకుంటున్నార‌ని ఆరోపించారు. గాంధీని శేరిలింగంపల్లి ప్రజలు గెలిపించలేదని ప్రజా సమస్యలు తీరుస్తాడని గెలిపించుకుంటే కాలనీవాసుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పైగా నడిగడ్డ తండా అసలు ఉండదని కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలందరికీ ఇండ్లు ఇస్తామని జాగా ఉంటే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 400 పైగా రేకుల ఇండ్లున్న నడిగడ్డ తండా పథకాలకు అర్హం కాదా అని ఈ ఎమ్మెల్యేని, ప్రభుత్వాన్ని అడుగుతున్నామ‌ని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న గాంధీ సమాధానం చెప్పాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో BRSనాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, మహిలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here