శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి, జనగాం , యాదాద్రి భువనగిరి జిల్లాలలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహకారంతో బాల్య వివాహాల విముక్త భారత్ రథాన్ని మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మనందరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించి బాల్య వివాహాలు జరగకుండా చూడాలని సూచించారు. స్కోప్ చైర్మన్ డాక్టర్ బండి సాయన్న మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో బాల్య విముక్త భారత్ అన్న కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో ఈ ప్రచార రథం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా బాల్యవివాహాలు నిర్వహించే వారందరూ చట్టప్రకారంగా శిక్షించబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఉప్పలయ్య, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ మనయ్య , కౌన్సిలర్ సబిత, కమ్యూనిటీ మొబిలైజర్లు రామా గౌడ్ సావిత్రి, లా అసోసియేషన్ మెంబర్ జగన్ , గోపా కార్యవర్గ సభ్యుడు మీరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చయ్య, సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.






