శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ సాయి నగర్ లో సమతామూర్తి , జగత్ గురువు , శ్రీ సంత్ శిరోమణి గురు రవిదాస్ విగ్రహ ప్రతిష్టాపన మొదటి రోజు మహోత్సవానికి శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జ్ , కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో సోదరభావం, సమానత్వం, శాంతి కోసం పరితపించి, ఆ దిశగా తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ సంత్ శిరోమణి గురు రవిదాస్ బోధనలు సర్వదా ఆచరణీయం, స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి నగర్ మోచి సంఘం సభ్యులు నాందేవ్ , విశ్వనాథ్ , తుకారాం , నర్సింగ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , బీజేపీ నాయకులు రాజు గౌడ్ , శివ , అశోక్ , స్థానిక బస్తీ వాసులు ఆకాష్ , నాగ మల్లేష్ , శ్యామ్ , కిరణ్ పాల్గొన్నారు.






