శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతారాముల దేవాలయం లో మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం అని అన్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు అని, శివరాత్రి నాడు వాడ వాడలా రోజు వారీ ఉపవాస దీక్షల తో , జాగారం తో వేడుక చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






