పరమశివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీ లోని సాయి బాబా దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరునికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పరమశివుడు కరుణామూర్తి. ఆయన ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, సమృద్ధి నెలకొనాలి. ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రతి ఒక్కరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here