శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న తనకు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి తెలిపారు.






