బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కి ఘన స్వాగతం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన నితిన్ నబిన్ కి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడానికి మసీదు బండ , కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జాతీయ అధ్యక్షుల పర్యటన ఎంతో కీలకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వరకు మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ స్వాగత కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మహిపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి , రాధాకృష్ణ యాదవ్ , ఎల్లేష్, పట్టాభిరామ్, లక్ష్మణ్, కిషోర్, వేణుగోపాల్ రెడ్డి, పద్మ, విజయలక్ష్మి, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here