శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని అంబేద్కర్ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, గణేష్ నగర్, తారకరామ్ నగర్ కాలనీలలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలలో కొంతమేర డ్రైనేజీ, సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని అన్నారు. వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీ లో మంజీరా వాటర్ ప్రెషర్ లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీ మహిళలు కార్పొరేటర్ కి తెలియచేయగా కార్పొరేటర్ సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి తాగు నీటి ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, బోయకిషన్, షేక్ బీబీ, సంతోష్ ముదిరాజ్, సమ్మద్, జగదీష్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, ఖలీమ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, UBD నాగరాణి, వాటర్ వర్క్స్ సూపర్వైజర్లు శ్రీనివాస్ , శివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






