శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ హైటెక్ సిటీ శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చైర్మన్ కిట్టు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లన్న కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. మాదాపూర్ మల్లన్న దేవాలయంలో మల్లన్న కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించగా బ్యాండ్ మేళాలతో ఊరేగింపు, బోనాల దీపాల ఊరేగింపు, మల్లన్న భక్తుల సిగాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఐలేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ యాదవ్ ముదిరాజ్, సంఘం నాయకుడు శంకర్ ముదిరాజ్ పాల్గొని పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ముద్దం కుటుంబ సభ్యులు యాదయ్య యాదవ్, ఐలేష్ యాదవ్, చైర్మన్ కిట్టు యాదవ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని మహేష్ యాదవ్, దొంతిపోయిన శ్రీనివాస్ యాదవ్, దర్గా ప్రవీణ్ యాదవ్, నార్సింగ్ మధు యాదవ్, చందానగర్ రాజు యాదవ్, కుమార్ యాదవ్, శంకర్ ముదిరాజ్, బిల్డర్ ప్రసాద్ యాదవ్, చందానగర్ రాజు యాదవ్, ఒగ్గు కళాకారులు బృందం, స్థానికులు పాల్గొన్నారు.






