శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ట్రాఫిక్ సిబ్బంది, మియాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆల్విన్ ఎక్స్ రోడ్, మియాపూర్ ఎక్స్ రోడ్ల వద్ద వాహనదారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తూ, తమ తమ విధి నిర్వహణ ప్రాంతాల్లో నిలబడి ఈ కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం దేశభక్తి భావాలను మరింత బలపరిచిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు, పోలీసులు కలిసి పాల్గొనడం ద్వారా సమాజంలో ఐక్యత, దేశప్రేమను చాటిచెప్పిన కార్యక్రమంగా ఇది నిలిచిందని అన్నారు.






