శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ సాయిబాబా టెంపుల్ దగ్గర మెయిన్ వాల్ బ్లాక్ అయి మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు సాగించే స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉందని వాటర్ వర్క్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారి శ్రీకాంత్, కాలనీవాసులు రక్తపు జంగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






