శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 8 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.4.80 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని, ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పేర్కొన్న గాంధీ, ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు CMRF భరోసాగా నిలుస్తోందన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వందలాది కుటుంబాలకు ఈ నిధి ద్వారా సాయం అందించామని చెప్పారు. భవిష్యత్తులో సహాయ మొత్తాన్ని పెంచేలా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, దొడ్ల రామకృష్ణ, జిల్లా గణేష్, మారేళ్ల శ్రీనివాస్, జంగయ్య యాదవ్, నర్సింహ, కాశినాథ్ యాదవ్, శివరాజు గౌడ్, గోపాల్, మున్నా , లింగం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.





