శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి మంజీర డైమండ్ హైట్స్ గేట్ కమ్యూనిటీలో నిర్వహించిన మంజీర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు సమాజంలో స్నేహభావం, ఐక్యతను పెంచడంతో పాటు యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మంజీర డైమండ్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు అనుషుమన్ మిశ్రా, సెక్రెటరీ శ్యామ్ ప్రధాన్, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, ఎంసీ మెంబర్స్ అంకుర్, జ్ఞానేశ్వర్, సోమేశ్ మిశ్రా, మంజీరా డైమండ్ హైట్స్ అధ్యక్షుడు పి ఆర్ రావు , ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సుందర చారి, జాయింట్ సెక్రెటరీ సుమంత్, సీనియర్ నాయకులు, మురుగ, విష్ణు, శివ, సాయి, మధు, సాయి, వంశీ, కంప్యూటర్ కమిటీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






