శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు గాను నిర్వహించిన ప్రాబబుల్స్ రెండో మ్యాచ్‌లో శేరిలింగంపల్లిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంకు చెందిన విద్యార్థి సీవీ చేతన్ ఆదిత్య సత్తా చాటాడు. 81 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కాగా ఆదిత్య ఇటీవలే రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలోనే ప్రాబబుల్స్‌కు నిర్వహించిన తొలి మ్యాచ్ లో ఆదిత్య రాణించగా, అదే జోరును తాజాగా జరిగిన 2వ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. మొదటి మ్యాచ్‌లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన చేతన్ ఆదిత్య 2వ మ్యాచ్‌లో 81 పరుగులు చేయడం విశేషం. కాగా ఈ ప్రదర్శనతో ఆదిత్య తుది జట్టులోనూ ఎంపికవుతానని ధీమా వ్యక్తం చేశాడు. అతని కోచ్ రవి అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆదిత్య ఇలాంటి మరెన్నో టోర్నీలకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






