శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా టిఆర్పి కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని నర్సింగ్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 200 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ వనం పద్మ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






