శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): నటుడు, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు 30 వ వర్థంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ త్రివేణి సర్కిల్ వద్ద కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ఎన్‌టీఆర్ విగ్రహానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, రక్తదానం శిబిరాన్ని ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు ఎన్‌టీఆర్ అని అన్నారు. అన్న అనే పదానికి మారుపేరు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించి ప్రజా సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన మహానుభావుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






