PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న నివాసంలో హఫీజ్‌పేట్ డివిజన్ నాయకుడు దాత్రి నాథ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి మకర సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సంక్రాతి అంటే తెలుగు ప్రజల పెద్ద పండుగ అని అన్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు ఈ పండుగని జరుపుతార‌ని, సంక్రాంతి రోజులలో పిండివంటలని తయారు చేయడం ఆనవాయితీ అని అన్నారు. సంక్రాంతి రాక ముందే అనేక రకాల పిండి వంటలని తయారు చేస్తార‌ని అన్నారు.

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శుభాకాంక్ష‌లు..

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న నివాసంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, సంజీవ రెడ్డి, నరేందర్ బల్లా మర్యాదపూర్వకంగా కలిసి మకర సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here