ఘనంగా శ్రీ సిద్దేశ్వర స్వామి, వడ్డే ఓబన్న ల జయంతి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజక వర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివయోగి సిద్ధ రామేశ్వర స్వామి 854 వ జయంతి, వడ్డే ఓబన్న 219వ జయంతి లను పురస్కరించుకొని ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ శివయోగి సిద్ధ రామేశ్వర స్వామివారి ఆశీర్వాదాలు భారతదేశంలో నివసిస్తున్న భారతీయుల అందరి పైన ఉండాలని ఆ స్వామివారి ఆశీర్వాదాలతో అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ జయంతి కార్యక్రమంలో అఖిలభారత వడ్డెర సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి, రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు రవి, రేపన్ హనుమంతు, పల్లపు మల్లేష్, తాయప్ప, శ్రీను, హనుమంతు, మారుతి, శ్రీకాంత్ , హసేన్, ఉలుగయ్య, దస్తప్ప, లక్ష్మణ్, రమేష్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here