సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో సంక్రాంతి పండుగ సంబురాలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ రాఘవేంద్ర నగర్ కాలనీలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో సంక్రాంతి సంబురాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా పాఠ‌శాల విద్యార్థులు నిర్వ‌హించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. విద్యార్థులు ప‌లు వేష‌ధారణలు, ఆటపాటలు, సంక్రాంతి పండుగకు సంబందించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పిఏసీ చైర్మన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరయ్యారు. సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్, డైరెక్టర్ భవాని, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, డా. చల్లా గీత, చాంద్ పాషా, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, సురేందర్ రెడ్డి, స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here