శేరిలింగంప‌ల్లిలో బీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి కృషి: పొట్ట న‌రేందర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి నాయ‌కుడు పొట్ట నరేందర్ యాదవ్, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన వారికి కేటీఆర్ కండువాలు క‌ప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంత‌రం న‌రేంద్ర యాద‌వ్ మాట్లాడుతూ శేరిలింగంప‌ల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తామ‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ జెండాను ఎగుర వేస్తామ‌ని అన్నారు. శేరిలింగంప‌ల్లిలో బీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారబోయిన రవి యాదవ్, మాజీ వార్డ్ మెంబర్ కృష్ణ యాదవ్, నిజాం, ఊట్ల సురేష్, సత్యం, రాజు యాదవ్, శీను ఫోటో, శ్రీశైలం యాదవ్, పాశం రాజు యాదవ్, హరి కుమార్, అందెల సత్యనారాయణ, బాబు యాదవ్, కృష్ణ మండల్, సుభాష్ రాథోడ్, బి మల్లేష్ గౌడ్ , శంకర్ ముదిరాజు,శశి కిరణ్, శంకర్, P N Y యూత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here