నూతన సంవ‌త్స‌ర‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన పల్లపు సురేందర్

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రజా నాయకుడుశ్రీ పల్లపు సురేందర్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను నల్లగండ్లకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ , కార్యకర్తల సమక్షంలో నల్లగండ్లలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లపు సురేందర్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు, బలోపేతానికి నిదర్శనమని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడి ఆశీర్వదిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, పేద, బడుగు, బీసీ, బహుజన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్, మహేశ్, కొండల్, దుర్గా ప్రసాద్, లోకేశ్, రవికుమార్, సత్యం, వేణు, విజయ్, రవికుమార్ , చింటు , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here