ఫుట్‌బాల్ పోటీల్లో స‌త్తా చాటిన విద్యార్థికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్ర‌శంస‌లు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేపాల్ దేశంలో పోక్ర లో ఉన్న‌ రంగసాల స్టేడియంలో జరిగిన ఇండో – నేపాల్ ఛాంపియన్ షిప్ అండర్ 19 ఫుట్ బాల్ గేమ్ లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించిన ప్రభుత్వ జూనియర్ కళశాల BHEL ఎంపిసి ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అహరోన్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళశాల BHEL లో ఎంపిసి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న అహరోన్ అనే విద్యార్థి ఇండో – నేపాల్ ఛాంపియన్ షిప్ 30 డిసెంబర్ 2025 నుండి 3 జనవరి 2026 వరకు నేపాల్ దేశంలో పోక్ర లో రంగసాల స్టేడియంలో జరిగిన అండర్ 19 ఫుట్ బాల్ గేమ్ లో సౌత్ జోన్ ఇండియా, తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కడే ఎంపిక కాబడి ఇండియా నుండి ఒక టీం, నేపాల్ నుండి రెండు టీం లుగా పాల్గొన్నార‌ని, ఈ గేమ్ లో తెలంగాణ రాష్ట్రం నుండి , సౌత్ ఇండియా నుండి అహరోన్ గోల్డ్ మెడల్ సాధించ‌డం గొప్ప విషయం అని , అహరోన్ కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ , లెక్చరర్, గులమోహర్ పార్క్ అధ్యక్షుడు ఖాసీం పాల్గొని PAC చైర్మన్ గాంధీకి పుష్పగుచ్ఛం అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here