శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఉమ్మడి పాలమూరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మియాపూర్ ఎస్ ఎమ్ ఆర్ వినయ్ హైలాండ్ క్లబ్ హౌస్ లో పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. వనపర్తి జిల్లా క్యాలెండర్ను ఉమ్మడి పాలమూరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. మియాపూర్ ఎస్ ఎం ఆర్ వినయ్ హై ల్యాండ్ క్లబ్ హౌస్ లో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా వనపర్తి జిల్లా ముఖచిత్రం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ చేసిందని ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ యాదవ్ ను అభినందించారు. ఇకనుండి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు ఐక్యంగా ఉండి ఉమ్మడి పాలమూరు చరిత్ర పై క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. అనంతరం డా. సతీష్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, నర్సిరెడ్డి, వంగూర్ సందీప్ రెడ్డి, పానగంటి కురుమయ్య, మాధవరం గోపాల్ రావు , కోటయ్య, టీ అనిల్, కుమార్, ఇస్లావత్ దశరథ్ నాయక్, విశ్వనాథం, రిటైర్డ్ ఎమ్మార్వో భాస్కర్ రెడ్డి, జగత్ పల్లి రమేష్ యాదవ్, చంద్రయ్య, నాగేంద్రం, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






