శేరిలింగంప‌ల్లిలోని ప‌లువురికి వినోద్ రావు శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రం 2026 సందర్భంగా శేరిలింగంప‌ల్లిలోని ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కుల‌ను క‌లిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ రావు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షల‌ను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా పీఏసీ చైర్మ‌న్‌, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ ను వినోద్ రావు క‌లిసి వారికి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం వినోద్ రావు మాట్లాడుతూ 2026 సంవత్సరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవల పరంగా మరింత పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం దిశగా మరింత కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here