శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్‌లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో బ్రైడల్ జ్యువెల్లరీ షోను ప్రారంభించినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ షో జనవరి 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలకు చెందిన ఆభరణాలను ప్రత్యేకంగా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అలాగే వినియోగదారులు ఆభరణాలను కొనుగోలు చేస్తే ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు వివరించారు. బంగారం, రత్నాభరణాలు, అన్‌కట్ ఆభరణాల తరుగు చార్జిలపై 30 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపారు. వజ్రాభరణాల విలువపై 30 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొన్నారు.






