శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన కాలనీలో చేపట్టవలసిన, పెండింగ్ లో ఉన్న సివరేజ్ పైప్ లైన్ పనులను జలమండలి మేనేజర్, సిబ్బంది, కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వారి విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులతో పర్యటించి సివరేజ్ లైన్ కలవటం లేదని తెలుసుకున్నామని అన్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో కలసి చర్చించి, పరిష్కారం చూపి, పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ విలియమ్ ప్రకాష్, సూపర్వైజర్ నరేంద్ర , సిబ్బంది, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






