శేరిలింగంపల్లి ప్ర‌జ‌ల‌కు ర‌వికుమార్ యాద‌వ్ శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ​ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడుమహేష్ యాదవ్, గచ్చిబౌలి, హఫీజ్ పేట్, మియాపూర్ డివిజన్ల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ని మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ ప్రజలందరూ 2025 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నారని, తెలంగాణ రాష్ట్ర, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రాజు, రమేష్, ఆంజనేయులు సాగర్, గణేష్, విష్ణు, రమణయ్య, నగేష్, దేవేందర్, శేఖర్, కృష్ణ, రాజు, శ్రీనివాస్, రాము, సోనూ, సంతోష్, రాజు యాదవ్, మల్లేష్, ప్రభాకర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here