శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంఏసీ విజయ్ కుమార్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సాయి కుమార్, ఏఎంవోహెచ్ డాక్టర్ కేఎస్ రవి, ఇంజనీరింగ్ ఏఈ ప్రశాంత్, ఎంటమాలజీ ఆర్.చిన్నా, యూబీడీ సమీర, ఎలక్ట్రికల్ లక్ష్మిప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు జీహెచ్ఎంసీలోని పలు సెక్షన్లకు చెందిన అధికారులు, సిబ్బందికి పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. టౌన్ ప్లానింగ్ లో 13 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్లో 1, ఎంటమాలజీలో 1 మొత్తం కలిపి 15 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఏఎంసీ విజయ్ కుమార్ సూచించారు.






