చందానగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ, కైలాష్ నగర్, భవాని శంకర్ నగర్, ఫ్రెండ్స్ కాలనీ, డిఫెన్స్ కాలనీ, వేముకుంట, జవహర్ నగర్, ఇక్రిశాట్, దీప్తి శ్రీ నగర్, సాయి నగర్, శాంతి నగర్, హుడా కాలనీ ఫేస్ 2, శివాజీ నగర్, ఇందిరా నగర్, తారా నగర్ కాలనీలలో రూ.5 కోట్ల 50 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, UGD, వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ. 5 కోట్ల 50 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, UGD, పార్క్ ప్రహారి గోడ, వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింద‌ని అన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీ వాసులకు ఉపశమనం లభించింద‌ని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here