అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చర్చిలలో చీరల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ ప్రగతి ఎన్ క్లేవ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , సాయి బాలాజీ ఇన్ ఫ్రా అధినేత అట్టేపల్లి రాం ప్రభు, స్వప్న ల 26 వ వివాహ వార్సికోత్సవ వేడుక సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ మెమరె చర్చ్, టేకు నరసింహ నగర్, ఎం.ఎ నగర్ లోని కల్వరి షారోన్ చర్చిలలో మహిళలకు చీరలను, నూతన సంవత్సర క్యాలెండర్ లను పంపిణీ చేశారు. అట్టేపల్లి రాంప్రభు తన కుటుంబ సభ్యులతో కలిసి పలు చర్చిలలో క్రిస్మస్ పర్వ దినం, క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాస్టర్ లు ఫిలిప్స్, జాన్ రాజ్, సుకుమార్ త‌దిత‌రులు అట్టేపల్లి రాంప్రభు, స్వప్న దంపతులకు యేసు క్రీస్తు ప్రభువు వాక్యం ద్వారా ఆశీస్సులను అందించారు.

ఈ సందర్భంగా అట్టేపల్లి రాంప్రభు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా త‌మ‌ తండ్రి అట్టేపల్లి లక్ష్మీ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో త‌మ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోట్ బుక్ లు, నూతన సంవత్సర క్యాలండర్ లు పంపిణీ చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు ఫీజులు కట్టి, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కూడా చెల్లించి విద్యార్థులకి బాసట గా నిలుస్తూ త‌మ‌ సంస్థ సహాయం అందిస్తుందన్నారు. త‌మ‌ పెళ్ళి స‌మ‌యంలో త‌మ‌కు క్రిస్మస్ పండుగ అని తెలియదని, ఇపుడు యాదృచ్ఛికంగా పండగ కలిసి రావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం త‌మ‌ 26 వ వివాహ వార్సికోత్సవ సందర్భంగా చర్చిలలో మహిళలకి చీరలు, నూతన సంవత్సర క్యాలెండర్ లను పంపిణీ చేసి సాటి వారికి సహాయం చేయాలనే యేసు క్రీస్తు స్పూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను సాయి బాలాజీ ఇన్‌ఫ్రా, అట్టే పల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వ‌హిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, శోభారాణి, రాజశేఖర్, వినోద్, శ్రీకాంత్, పొన్నం సతీశ్, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here