శేరిలింగంపల్లి, డిసెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సుదర్శన్ నగర్ కాలనీలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ కుమార్, స్థానికవాసులతో కలిసి పలు సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధాన సమస్యలుగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. గతంలో పలు కాలనీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు కార్పొరేటర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ లో మౌలిక సదుపాయాలు ఇతర మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సుదర్శన్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నిర్మల్ కుమార్, ట్రెజరర్ సుధాకర్, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ రావు, కాంక్రీట్ డెస్టినా అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ పవన్, హానరరీ ప్రెసిడెంట్ వెంకటయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజేంద్ర చారి, వెంకటేశం, సుబ్రహ్మణ్యం, వాణి, మానస, మాట్రిక్స్ యూత్ మెంబర్స్ కోటేశ్వరరావు, రంజిత్, సిద్ధార్థ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.





