శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ లో ఉన్న సాయి ఐశ్వర్య కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ క్యాలెండర్ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. శిరిడీ సాయిబాబా బోధనలు సర్వమానవాళికి ఆదర్శమని, శ్రద్ధ సబూరి అనే సాయిబాబా సందేశం నేటి సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా, సామాజిక ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బొంత వెంకట నరసింహ మూర్తి, కార్యదర్శి భిక్షాల రావు, కోశాధికారి ఫణి కిషన్, ఆలయ కమిటీ సభ్యులు రమణి, విశాలాక్షి, సదానంద్, బండ రామ రెడ్డి, అశోక్ రాజు, మహేష్, ముక్తేశ్వర రావు, సుబ్రమణ్యం, ఫణీంద్ర, అశోక్, సత్య నారాయణ, సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, ఈశ్వరయ్య, అరుణ్, తిరుపతి, రాజు, శ్రీను, గోవింద్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, భక్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





