శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): రాజకీయాలకతీతంగా హిందువులందరూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో కంకణ బద్దులు అవ్వాలని బిజెపి సీనియర్ నాయకుడు చింతకింది గోవర్ధన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామ సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలుపొందిన కొయ్యల వినోద రాజా గౌడ్, గ్రామ వార్డ్ మెంబర్లు గురువారం శేరిలింగంపల్లిలోని చింతకింది గోవర్ధన్ గౌడ్ నివాసానికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టి పోటీలోను రాజా గౌడ్ బృందం భారీ మెజారిటీతో గెలవడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అందరు కలసి కట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరచడంతో పాటు హిందూధర్మాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం రాజాగౌడ్ తో పాటు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలను ఘనంగా సన్మానించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలసి అల్పాహారం తీసుకున్నారు.






