సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీకి చెందిన భాగ్యమ్మ దమని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, చంద్రమోహన్ సాగర్, ఆనంద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here