శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కంచి కేఫ్ ను పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్వితీయ రుచులకు చిరునామాగా కంచి కేఫ్ నిలవాలన్నారు. రుచికరమైన టిఫిన్స్ అందిస్తూ చుట్టుపక్కల వినియోగదారుల మన్ననలను పొంది దినదినాభివృద్ధి చెందాలన్నారు. సొంతంగా వ్యాపారం చేయడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో, యువత స్వయం ఉపాధి పొందే మార్గం వైపు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, జలేందర్ రెడ్డి, దొర బాబు, శ్రీరాములు , శేఖర్ ప్రభాకర్, తిరుపతి, రంగస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, గిరి, రాజు, శ్రీను, నర్సింగ్ రావు, గోవింద్, నాగేష్, బాబు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






