శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోట్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టామని సీఐ ప్రశాంత్ తెలిపారు. మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ సూచనల మేరకు కొండాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించామని, మదీనాగూడ యు-టర్న్ వద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నామని తెలిపారు. ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద నెలకొంటున్న భారీ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే చందానగర్‌కు వెళ్లే వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల వాహనదారులకు ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గుతుందని అన్నారు.






