విద్యార్థులు చ‌దువులు, క్రీడ‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇవ్వాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో GVR Global Erudite స్కూల్ and Ridge Board స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్- 2025 కార్యక్రమాన్ని సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, GVR గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ భీష్మా రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ GVR Global Erudite స్కూల్ and Ridge Board స్కూల్ ఆధ్వర్యంలో క్రీడా మహోత్సవం (స్పోర్ట్స్ మీట్) నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని అన్నారు. పిల్లలలో దాగిన సృజనాత్మకతను బయటకి వెలికి తీయడానికి ఎంతగానో తోడ్ప‌డుతుంద‌ని అన్నారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడలు ఎంతగానో ముఖ్యం అని అన్నారు. క్రీడలతో శారీరక శ్రమతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుంద‌ని, పిల్లలు చదువులతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అప్పుడే భావి పౌరులుగా దేశానికి సేవలు అందిస్తార‌ని, తల్లిదండ్రులకు, దేశానికి మంచి సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here