అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ లో నర్సింగ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ స్వామివారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ స్వామి, కొండా విజయ్, కే రాంచందర్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, నరేందర్, కిరణ్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here