శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ఐ-బొమ్మ నిర్వాహకుడు రవిని క్షమించాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసింది తప్పు అయినందున పెద్ద మనసు చేసుకుని సినిమా ఇండస్ట్రీ వారు, అధికార ప్రభుత్వం ఒక్క హెచ్చరిక ఇచ్చి ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని వదిలేయాలని అన్నారు. ఇమ్మడి రవిని పట్టుకున్నందుకు హైదరాబాద్ సి పి సజ్జనార్, సివి ఆనంద్ ని తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నట్టే మూవీ రూల్స్ నిర్వాహకుడిని కూడా పట్టుకోవాలని అన్నారు. సినిమా థియేటర్ లలో సామాన్య ప్రజలు సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టు టికెట్ల రేట్లు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ వారు అధికార ప్రభుత్వం కలిసి సామాన్య ప్రజలు సినిమా చూసేలా టికెట్ల ధరలని తగ్గించాలని సూర స్రవంతి డిమాండ్ చేశారు. సినిమా టికెట్స్ మీద ఉన్న ఆసక్తి రైతుల మీద ఉంటే మన రాష్ట్రంలో ఎలాంటి పేదరికం ఉండదని అన్నారు. సినిమా చూసిన వాడి జేబు ఖాళీ అవుతుందని, సినిమా తీసిన వాడి ఆదాయం కోట్లలో ఉంటుందని సూర స్రవంతి అన్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి గట్టి హెచ్చరిక ఇచ్చి వదిలేసి కొన్ని రోజులు పోలీస్ నిఘాలో పెట్టి అనంతరం అతని తెలివి తేటలని సైబర్ క్రైమ్ పోలీసులు మంచికి వాడుకోవాలని సూర స్రవంతి సూచించారు.






