కార్తీక‌మాసం చివ‌రి రోజు సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ ప్ర‌త్యేక పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కార్తీకమాసం చివరి రోజును పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని బాబాని దర్శించుకున్నారు. అనంతరం స్థానికవాసులతో కలిసి అభిషేకం, అర్చన కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక హారతి ఇచ్చి ఆలయ పరిసరాల్లో కొంతసేపు భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ కార్తీకమాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పవిత్ర నెలలో చేసే పూజలు ప్రతి ఇంటికి శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను తీసుకువస్తాయని పేర్కొన్నారు.

స్థానికులు దేవాలయ అభివృద్ధి సంబంధిత అంశాలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, ఇటీవలే ఆలయ మిగిలిన అభివృద్ధి పనులపై ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. వీటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, హరి, ప్రవీణ్, వెంకటేష్, నాగరాజు, రమా, నాగేందర్, ఎల్లేష్, భాగ్యలక్ష్మి, లక్ష్మి, సుధారాణి, కుమారి, రోజారాణి, దేవి, రాంబాబు, మోహన్ రావు, భద్ర, స్థానికవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here