యాదవ సంఘ కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కే.పి.హెచ్.బి గోవర్ధన గిరి ఆలయం వద్ద కూకట్ ప‌ల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ అందరం కార్తీకమాస వనభోజన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందకరమైన విషయం అని అన్నారు. వనభోజనాలు, సమావేశాలు మాత్రమే కాకుండా యాదవులు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కమిటీ ఆర్థికంగా , సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించి వారి ఆరోగ్యపరమైన, విద్యాపరమైన స‌హాయం అందించి మనం అందరినీ వృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు. త‌న‌ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఎలాంటి సమస్య ఉన్నా త‌న‌ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, రామచంద్ర యాదవ్, నాగరాజు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శంకర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, రమణ, వికాస్, వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here