ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు: మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్యలు తీసుకుంటామ‌ని, ట్రాఫిక్ స‌జావుగా సాగేందుకు ప్ర‌తి ఒక్క‌రు స‌హ‌క‌రించాల‌ని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న ఆధ్వ‌ర్యంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గోకుల్ ఫ్లాట్స్ నుంచి హైటెన్ష‌న్ లైన్ వ‌ర‌కు పైప్‌లైన్ రోడ్డు మీదుగా ర‌హ‌దారికి ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది తొల‌గించారు. ఈ సంద‌ర్భంగా ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ మాట్లాడుతూ ఫుట్ పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం వ‌ల్ల ట్రాఫిక్ స‌జావుగా సాగుతుంద‌ని తెలిపారు. చిరు వ్యాపారులు, వాహ‌న‌దారులు ట్రాఫిక్ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here