శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నగరంలో న్యూ అంబేద్కర్ భవన్ లో ప్రతినిధుల సమావేశంలో ఏ ఐ సి టి యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల బీడీ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని మరువడంతో వారి ఆర్థిక పరిస్థితి అమ్యకోచరంగా తయారైందని, ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుందని అన్నారు. ఆలోచన అప్పుడే లేకుండా పోయిందని వాపోయారు. కేంద్రంలోమోదీ ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అంబానీ, అదానీలకు లక్షలాది కోట్ల రూపాయల లాభం చేస్తూ బీడీ కార్మికులపై జీఎస్టీ విధించడం సరైంది కాదన్నారు.






