ఆకట్టుకున్న ప్రత్యూష బృందం అన్నమ స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని అన్న‌మాచార్య భావ‌న వాహినిలో డా. శోభా రాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం కొన‌సాగుతున్న అన్నమ స్వరార్చనలో భాగంగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి సంకీర్తనా నైవేద్యం సమర్పించారు. ఇందులో భాగంగా ప్రత్యూష శిష్య బృందం జె. యశస్విని, డి. విజయ కుమారి, బి. వి. వి. సత్యవాణి, వి‌. ధనలక్ష్మి సంయుక్తంగా సుస్వరంగా వినాయక నేను, గరుడాద్రి వేదాద్రి, శరణు శరణు నీకు, వీడుగదే శేషుడు, వేదం బెవ్వని, నారాయణతే నమో నమో, రామచంద్రుడితడు, లాలి శ్రీ కృష్ణయ్య, గోవిందా అను నామోచ్చారణ, ఆనంద నిలయ అనే ప్రఖ్యాత సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో ఆలపించి అందరి మన్ననలు పొందారు. కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ జ్ఞాపికలతో సత్కరించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here