శేరిలింగంపల్లిలో ఘనంగా దసరా వేడుకలు.. వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్..

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): విజయదశమిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో దసరా ఉత్సవాలను కన్నేపల్లి రామచంద్ర మూర్తి ఆశీస్సుల‌తో ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా రామాలయం ఆవరణలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. రావణ దహనం కార్యక్రమాన్ని కార్పొరేటర్ సంప్రదాయబద్ధంగా నిర్వహించి రావణాసురుడిని దహనం చేశారు.

ఈ సందర్బంగా విచ్చేసిన భక్తులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం MIG లోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ హాజ‌రై యువతలో జోష్ నింపారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ కష్టాల కడలి నుంచి విజయానికి నాంది పలికే పండగే విజయదశమి అని అన్నారు. మనం పూజించే ప్రతి దేవుడు విజయం సాధించిన రోజు విజయదశమని అన్నారు. మనందరి జీవితాల్లో విజయాలు రావాలని, ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రామాలయం ఆలయ కమిటీ సభ్యులు, ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు, భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here