శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో గత రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన ప్రాంతాలను హైడ్రా సిబ్బంది, స్థానిక కాలనీ సభ్యులతో కలిసి దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. స్థానికంగా కాలనీలో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.






