స‌మాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌర‌వ ప్ర‌ద‌మైంది: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం ను పురస్కరించుకుని జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో మండల విద్యాధికారి(MEO) వెంకటయ్య, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి మండల ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, గురుపూజోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి లోని ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం చాలా సంతోషంగా ఉంది అని, నవ సమాజ నిర్దేశకులు గురువులను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here